English | Telugu

దసరా లోపే ప్రభాస్‌ పెళ్లి.. కృష్ణంరాజు సతీమణి క్లారిటీ!

వయసు మీరుతున్నా ఇంకా పెళ్ళి ఆలోచన లేని హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో ప్రభాస్‌ పెళ్ళి గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమధ్య ప్రభాస్‌ పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. పెళ్లి ఎప్పుడు, ఎవరిని పెళ్ళి చేసుకోబోతున్నాడు అంటూ రకరకాల ఊహాగానాలు చేశారు. దీనిపై ప్రభాస్‌గానీ, అతని కుటుంబ సభ్యులుగానీ స్పందించకపోవడంతో అంతా సైలెంట్‌ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్‌ పెళ్ళి అనే న్యూస్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్‌ పెద్దమ్మ.. ప్రభాస్‌ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం వల్లే మరోసారి ప్రభాస్‌ పెళ్లి అనే వార్త తెరపైకి వచ్చింది. ప్రభాస్‌ తన కెరీర్‌పైనే దృష్టి పెట్టాడు తప్ప పెళ్ళి ప్రస్తావన అస్సలు తీసుకు రావడం లేదు. అయితే శ్యామలాదేవి మాత్రం ప్రభాస్‌కి పెళ్లి చేసి అతన్ని ఓ ఇంటివాడ్ని చెయ్యాలని పట్టుదలగా ఉన్నట్టుంది. తాజాగా ప్రభాస్‌ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ చెప్పింది. దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న శ్యామలాదేవి విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ప్రభాస్‌ పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది.


ఈ విషయమై ఆమె స్పందిస్తూ ‘‘కృష్ణంరాజుగారి పేరును నిలబెడుతూ ప్రభాస్‌ హీరోగా మంచిపేరు తెచ్చుకుంటున్నాడు. ఆయన ఉన్నప్పుడే ప్రభాస్‌ పెళ్లి చేద్దామనుకున్నాం. షూటింగ్స్‌ బిజీ వల్ల అది సాధ్యపడలేదు. ఇక అతని పెళ్లి చేసెయ్యాలని నిర్ణయించుకున్నాం. అమ్మాయి ఎవరు? ఎప్పుడు పెళ్ళి అనేది చెప్పను కానీ.. త్వరలోనే ఆ శుభకార్యం జరుగుతుంది. వచ్చే దసరా నాటికి ప్రభాస్‌ పెళ్లి జరుగుతుంది’’ అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు తీపి కబురు చెప్పారు శ్యామలాదేవి. ఈ న్యూస్‌ విన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సంతోషానికి అవధుల్లేవు.

ఇదిలా ఉంటే... ప్రభాస్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 23. ప్రస్తుతం యూరప్‌లో ఉన్న ప్రభాస్‌ అక్కడే తన బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకోబోతున్నాడు. అతని క్లోజ్‌ ఫ్రెండ్స్‌, బంధువులు ప్రభాస్‌ బర్త్‌డేకు యూరప్‌ వెళ్ళబోతున్నారు.