English | Telugu

ఎలక్షన్ డేట్ రాగానే.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్!

ఇటీవల 'గామి' సినిమాతో ప్రేక్షకులను పలకరించి ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. త్వరలోనే మరో సినిమాతో అలరించనున్నాడు. అదే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్.

గతేడాది చివరిలో విడుదల కావాల్సిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది మార్చి 8న విడుదలవుతుందని ఆమధ్య మేకర్స్ ప్రకటించారు. కానీ విడుదల కాలేదు. మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించలేదు. నిన్నటి వరకు ఎన్నికలు ఏప్రిల్ నెలలో ఉంటాయో, మేలో ఉంటాయో క్లారిటీ లేకపోవడంతో మేకర్స్ కొత్త డేట్ ని లాక్ చేయలేదు. అయితే తాజాగా పోలింగ్ తేదీపై క్లారిటీ వచ్చింది. మే 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మేకర్స్ కొత్త విడుదల తేదీని లాక్ చేశారు. పోలింగ్ కి, రిజల్ట్ కి మధ్యలో రిలీజ్ ని ప్లాన్ చేశారు. మే 17న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను వదిలారు. పోస్టర్ లో లుంగీ ధరించి, నోట్లో బీడీతో ఉన్న విశ్వక్ సేన్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది.

మరి ఎన్నికల ఫలితాలకు 20 రోజుల ముందు వస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం