English | Telugu

ఓటిటి లో అదరగొడుతున్న సస్పెన్స్ చిత్రం 

ప్రస్తుతం థియేటర్స్ ఎలా అయితే కొత్త చిత్రాల విడుదలతో కళకళలాడుతున్నాయో, ఓటిటి వేదికగా కూడా పలు జోనర్స్ కి చెందిన విభిన్న చిత్రాలు మూవీ లవర్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఒక చిత్రమే 'ది మాస్క్'(The Mask).టైటిల్ లోనే ఎంతో విభిన్నతని చాటుకున్న ది మాస్క్ ఈ నెల 12 నుంచి ప్రముఖ ఓటిటి మాధ్యమం 'ఈటీవీ విన్'(Etv Win)లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ చిత్రం కథాంశం విషయానికి వస్తే ఈజీ మనీ కోసం ఒక యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పందెం కాసి, ఆ డబ్బులు మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. అప్పు చేసిన డబ్బు కావడంతో, ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఒక ధనవంతుల ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు.ఈ క్రమంలో ఒక ఆపదలో చిక్కుకుంటాడు.మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే చిత్ర కథ. చెప్పుకోవడానికి చిన్న పాయింట్ అయినా సస్పెన్స్, డ్రామా, డార్క్ హ్యూమర్ ఒక రేంజ్ లోఉంటుంది. కథనంలో పట్టు సడలకుండా ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో కూడా మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

రిషికేశ్వర్ యోగి సమర్పణలో, కథా గని పిక్చర్స్ బ్యానర్‌పై కొత్తపల్లి సురేష్(Kothapalli Suresh)దర్శకత్వం వహించగా రావన్ నిట్టూరి, గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించారు. విశాల్ భరద్వాజ్ మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .