English | Telugu

'ఖుషి'తో విజయం దక్కేనా.. మరో గీతగోవిందమా? లైగరా?

'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి చిత్రాలతో తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ.. గత కొంతకాలంగా వరుస పరాజయాలు చూస్తున్నాడు. 2018 లో వచ్చిన 'టాక్సీవాలా' తర్వాత విజయ్ విజయాన్ని చూసి ఐదేళ్లు అవుతుంది. ఈ ఐదేళ్లల్లో విజయ్ నుంచి 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'లైగ‌ర్' అనే మూడు సినిమాలు రాగా.. మూడూ ఒకదాన్ని మించి ఒకటి పరాజయం పాలయ్యాయి. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలన్నీ 'ఖుషి'పైనే ఉన్నాయి.

విజయ్, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఖుషి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు(సెప్టెంబర్ 1న) ప్రేక్షకుల ముందుకు రానుంది. పాటలు, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ మూవీ ఓవరాల్ గా రూ.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే రూ.53 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటిదాకా విజయ్ కెరీర్ లో 'గీత గోవిందం' మాత్రమే రూ.50 కోట్లకు(దాదాపు రూ.70 కోట్లు) పైగా షేర్ రాబట్టింది. 'గీత గోవిందం' తరహాలోనే 'ఖుషి' కూడా యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తీసిన సినిమా. పైగా పాటలు పెద్ద హిట్ అయ్యాయి. హిట్ టాక్ వస్తే 'గీత గోవిందం' స్థాయి వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యంలేదు. కానీ పొరపాటున నెగటివ్ టాక్ వస్తే మాత్రం భారీ నష్టాలు తప్పవు. విజయ్ గత చిత్రం 'లైగర్' రూ.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి, భారీ అంచనాలతో విడుదలై.. చివరికి రూ.60 కోట్ల నష్టంతో డిజాస్టర్ గా నిలిచింది. 'లైగర్' తర్వాత విజయ్ కెరీర్ లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమా 'ఖుషి'. మరి ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ పరంగా మరో 'గీత గోవిందం' అవుతుందో లేక మరో 'లైగర్'లా మిలిగిపోతుందో చూడాలి.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.