English | Telugu
విచారణకు రెడీ అంటోన్న వరలక్ష్మి
Updated : Aug 31, 2023
ఇటీవల డ్రగ్స్ కేసులో సినీ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు ఎన్‌ఐఎ అధికారులు సమన్లు పంపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని వరలక్ష్మీ అంటున్నారు. మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వార్తను చూసి షాక్ అయ్యానంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆదిలింగం తన వద్ద మూడేళ్ళ క్రితం ఫ్రీలాన్స్‌గా పనిచేశాడని, ఇప్పుడతను ఎక్కడ ఉన్నాడో కూడా తనకు తెలియదని అంటోంది వరలక్ష్మీ.
2020లో కేరళలోని తీరప్రాంతంలో నేవీ పోలీసులు ఒక పడవలో 300 కిలోల డ్రగ్స్, ఎకె47 రైఫిల్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 13 మందిని అప్పుడే అరెస్ట్ చేశారు. 14వ వ్యక్తిగా ఆదిలింగం నుంచి అదుపులోకి తీసుకున్నారు. భారత ప్రభుత్వం నిషేధించిన ఎల్‌టిటిఇ సంస్థకు ఆదిలింగం టీమ్ నిధులు చేసేవారని , అంతేకాదు దీని ద్వారా సంపాదించిన డబ్బును క్రిప్టో కరెన్సీలో, సినిమాల్లో పెట్టుబడిగా పెట్టారని తెలుస్తోంది. ఈ విషయంలో వరలక్ష్మీకి సంబంధం ఉందేమోనన్న అనుమానంతో విచారణకి పిలవాలనుకున్నారు. అయితే వరలక్ష్మి మాత్రం తన గురించి మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారని అంటోంది. విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు కోరితే తప్పకుండా వెళ్తానని చెబుతోంది.