Read more!

English | Telugu

బాలకృష్ణ మూవీకి మ్యూజిక్ చేస్తా... సిస్టర్ సెంటిమెంట్ తో బిచ్చగాడు 2

బిచ్చగాడు ఫస్ట్ పార్ట్ లో స్టోరీ మొత్తం మదర్ సెంటిమెంట్ చుట్టూ నడిస్తే బిచ్చగాడు 2 స్టోరీ మొత్తం సిస్టర్ సెంటిమెంట్ చుట్టూ నడుస్తుంది అంటూ టేస్టీ తేజ ఇంటర్వ్యూలో చెప్పాడు విజయ్ ఆంటోనీ. అలాగే కొంత మంది ఫాన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా ఆన్సర్స్ ఇచ్చాడు విజయ్. ఇప్పుడు ఫామిలీ ఎంటర్టైనర్ మూవీ చేసాం కాబట్టి త్వరలో థ్రిల్లర్ మూవీ చేస్తాను అని చెప్పాడు. ఈ బిచ్చగాడు 2 మూవీకి సంగీతాన్ని అందించాడు విజయ్. "వేరే హీరోస్ మూవీస్ కి మ్యూజిక్ చేయాల్సి వస్తే బాలకృష్ణ మూవీకి మ్యూజిక్ చేస్తారా" అని అడిగేసరికి "చేస్తానని" చెప్పాడు. "ఫామిలీ హీరో ఐన శ్రీకాంత్ గారికి మహాత్మా మూవీలో మీరు ఇచ్చిన మాస్ బీట్స్ మామూలుగా లేవు. నాటు ముక్క, నీలపురి గాజులు సాంగ్స్ ఈరోజుకి కూడా ఫేమస్ కదా" అన్నాడు తేజ.

తర్వాత ఈ మూవీ షూటింగ్ లో జరిగిన ప్రమాదం గురించి హీరోయిన్ చెప్పుకొచ్చింది. "మలేషియాలో లవ్ సాంగ్ షూటింగ్ కోసం సముద్రంలో జెట్ స్కి మీద విజయ్  ప్రాక్టీస్ చేసాక షాట్ అంతా ఓకే ఐపోయింది. ఒక క్లోజప్ షాట్ కోసం మేము రెండు కొండల మధ్య నుంచి వచ్చి అలా బోట్ మీద వెళ్ళాలి..ఆ సీన్ చేస్తున్నప్పుడు  బోట్ ఫ్రంట్ పార్ట్ పైకి లేచింది ఆయన ఫేస్ కి ఢీకొట్టింది..దాంతో  మేము నీళ్లలో పడిపోయాం. చాలాసేపటి తర్వాత మాకు తెలిసింది మేము నీళ్లలో పడిపోయామని...ఆ తర్వాత విజయ్ ఆంటోనీ నీళ్ళల్లో మునిగిపోతూ ఉండగా నాకు కొంచెం స్విమ్మింగ్ వచ్చి ఉండడంతో ఆయన్ని బయటికి లాక్కుని వచ్చాను కానీ తర్వాత నా వల్ల కాలేదు వెంటనే క్రూ మెంబర్స్ కి చెప్పేసరికి ఆయన్ని బోట్ లోకి లాక్కొచ్చి సిపిఆర్ చేసాక హాస్పిటల్ లో అడ్మిట్ చేసాం. ఆయన ముక్కు దవడ మొత్తం డ్యామేజ్ ఐపోయాయి. అది చాలా మేజర్ యాక్సిడెంట్..ఫస్ట్ ఆయన ఊపిరి తీసుకోకపోయేసరికి ఆయన చనిపోయారని అనుకున్నాం..కానీ అదృష్టం ఆయన ఉపిరి తీసుకోవడం మొదలు పెట్టాక మాకు ఊపిరొచ్చింది " అని చెప్పింది హీరోయిన్ కావ్య థాపర్.