English | Telugu
వెంకీ, రామ్ ల టైటిల్ ఖరారు
Updated : Aug 1, 2013
వెంకటేష్, రామ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రానికి "గోల్ మాల్" అనే టైటిల్ ను ఖరారు చేశారు. హిందీలో ఘన విజయం సాధించిన "బోల్ బచ్చన్" చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్రవంతి రవికిషోర్, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట్లో "రామ్ బలరామ్" అనే టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా "గోల్ మాల్" అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి, రామ్ సరసన షాజన్ పదంసీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.