English | Telugu

చిరంజీవి సినిమాలో వెంకటేష్‌.. షూటింగ్‌ ఎప్పట్నుంచి అంటే..?

మొదటి సినిమా ‘పటాస్‌’తోనే భారీ విజయాన్ని అందుకున్న డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి.. వరస విజయాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. అనిల్‌ ఇప్పటివరకు చేసిన 8 సినిమాల్లో మూడు సినిమాలు వెంకటేష్‌తోనే చేసి హ్యాట్రిక్‌ సాధించిన విషయం తెలిసిందే. యాక్షన్‌తోపాటు కామెడీని కూడా బ్యాలెన్స్‌ చేస్తూ అనిల్‌ చేసిన సినిమాలన్నీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్‌ని డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి కామెడీ టైమింగ్‌ గురించి అందరికీ తెలుసు. తన కెరీర్‌లో చేసిన చాలా సినిమాల్లో కామెడీని ఒక రేంజ్‌లో పండిరచారు. ఇప్పుడు అనిల్‌ రావిపూడి వంటి డైరెక్టర్‌తో సినిమా అంటే ప్రేక్షకులకు, అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ లోటు ఉండదు. చాలా కాలం తర్వాత ఒక పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌ చేయడం మెగా అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమే.

వెంకటేష్‌తో హ్యాట్రిక్‌ సాధించిన అనిల్‌.. ఇప్పుడు చిరుతో చేస్తున్న సినిమాలో వెంకీతో ఒక కీలక పాత్ర చేయిస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నప్పటికీ ఇంతవరకు వెంకటేష్‌ సెట్స్‌కి వెళ్ళకపోవడంతో ఈ సినిమాలో అతను నటిస్తున్నాడన్న వార్త నిజమేనా అనే డౌట్‌ అందరిలోనూ ఉంది. అయితే దానికి చెక్‌ పెడుతూ అక్టోబర్‌ 21 నుంచి మెగాస్టార్‌తో కలిసి షూట్‌లో పాల్గొనబోతున్నారు వెంకీ. అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీతో కూడిన క్యారెక్టర్‌లో వెంకటేష్‌ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇద్దరు టాలీవుడ్‌ స్టార్స్‌ ఒకే స్క్రీన్‌పై కనిపించడం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. జనవరి 9న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మూవీ ‘రాజా సాబ్‌’ కూడా రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం