English | Telugu

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి కన్నుమూశారు. 78 ఏళ్ళ రఘునాథ రెడ్డి.. శనివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితమే ఆయన కుమారుడు మరణించారు. ఆ బాధతోనే రఘునాథ రెడ్డి కన్నుమూసినట్లు సమాచారం. (Actor Raghunath Reddy)

రఘునాథ రెడ్డి స్వస్థలం విజయవాడ. శోభన్ బాబు హీరోగా నటించిన 'సర్పయాగం' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. 370కి పైగా సినిమాలలో నటించారు. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, భోజ్ పురి భాషలలో కూడా నటించారు. పలు టీవీ సీరియళ్ళలోనూ నటించి మెప్పించారు.

ప్రేమించుకుందాం రా, మల్లీశ్వరి, శ్రీరామ రాజ్యం వంటి సినిమాలు నటుడిగా రఘునాథ రెడ్డికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. చివరిగా 2018లో వచ్చిన 'సుబ్రహ్మణ్యపురం'లో నటించారు. అనారోగ్య సమస్యలు, వయసురీత్యా కొన్నేళ్లుగా నటనను దూరంగా ఉంటున్నారు.