English | Telugu

కేసిఆర్ ప్రమాణస్వీకారంపై వర్మ సెటైర్లు

రాంగోపాల్ వర్మ, వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారని ఒకరంటే, వాటిలో ఎంతో నిజం ఉందని మరొకరంటుంటారు. తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న హడావుడి గురించి ఆయన సూటిగా కొన్ని ప్రశ్నలు గుప్పించారు. కెసిఆర్‌నే కాదు, ప్రజలను, నాయకులను కూడా ఆయన ప్రశ్నించారు. గతంలో పదవులు చేపట్టిన నాయకులే ఇప్పుడు పదవీ స్వీకారం చేస్తున్నారు. అప్పుడు ఇచ్చిన హామీలు వీరు నిలబెట్టుకోలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని ఇలాంటి నాయకులకు మళ్లీ ప్రమాణస్వీకారాలు ఎందుకు? ప్రమాణ స్వీకారాలకు అట్టహాసమైన వేడుకలు ఎందుకు? అసలు ప్రజలకు, నాయకులకు ప్రమాణస్వీకారాలు అంటే తెలుసా? అని వర్మ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన గురించి ఒక ఇంగ్లీష్ పేపరుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకులు, డాక్టర్లు, లాయర్లు మొదలైన వారు వృత్తి, అధికారం చేపట్టేటప్పుడూ చేసే ప్రమాణాలను మరిచి ప్రవర్తిస్తుంటే అలాంటి వారిపై విసుగు, అసహనం కలుగుతుందన్నారు. ప్రమాణ స్వీకారానికి ఉన్న విలువ దిగజారుస్తున్న వారందరిపై వర్మ ఇలా విరుచుకుపడ్డారు. వర్మ చెప్పిన మాటలు వినడానికి కటువుగా వున్నా అందులో యదార్థం మాత్రం ప్రజలందరికీ తెలిసిందే. ఈ విషయం గురించి ఆలోచిస్తే, ప్రమాణస్వీకారంపై చేసే అట్టహాసం, హడావుడి ఎలాగూ తప్పవు. ఆ తర్వాతైనా ప్రమాణాలు నిలబెట్టుకునే విషయంలో దృష్టి పెడితే బాగుంటుందనిపిస్తుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .