English | Telugu
పెళ్లిడు కొచ్చిన అమ్మాయిలని భయపెట్టిస్తున్న చిన్నారి పెళ్లి కూతురు
Updated : Nov 24, 2023
ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయిన నటి అవికాగోర్. ఈ చిన్నారి పెళ్లి కూతురు తాజాగా వధువు అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక అంతే ఇప్పుడు అందరు తన గురించే మాట్లాడుకునేలా వధువు ముస్తాబయ్యింది.
వెయ్యి అబద్దాలు ఆడైనా సరే ఒక పెళ్లి చెయ్యాలని అంటారు. కానీ నా పెళ్ళిలో అన్ని రహస్యాలే అని ఒక ఇంటికి కోడలుగా వెళ్తున్న నవ వధువు ఇందు చెప్పడంతో ట్రైలర్ ప్రారంభం అయ్యింది. తన భర్త ఆనంద్ తో కలిసి అత్తగారింట్లో అడుగుపెట్టిన ఇందు పై ఎవరో కావాలని చేస్తున్నట్టుగా కొన్ని హత్యా ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి మీద ఇందుకు అనుమానంగా ఉంటుంది. ఇంకో పక్క ఇందు భర్త,మరిది లు కూడా తమ మాటలతో అనుమానాస్పదంగా కనిపిస్తారు. ఇక ట్రైలర్ చివరలో ఒక అపరిచిత మహిళ అసలు ఆట ఇప్పుడు మొదలయ్యింది అని చెప్పడంతో వధువు మరింత క్యూరియాసిటీ ని ప్రేక్షకులకి కలిగించింది.
డిసెంబర్ 8 న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ మూవీలో ఇందు పాత్రలో అవికా గోర్ నటించగా ఇందు భర్తగా ప్రముఖ నటుడు నందు, ఇందు మరిదిగా అలీ రెజా లు నటిస్తున్నారు. వధువుని ఎస్విఎఫ్ బ్యానర్ పై శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోనీ లు నిర్మించగా పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు.