English | Telugu

గంధర్వ మహల్ కడుతున్న మంచు లక్ష్మి

గంధర్వ మహల్ కడుతున్న మంచు లక్ష్మి అని తెలిసింది. అలా తెలిపింది కూడా మంచు లక్ష్మే కావటం విశేషం. వివరాల్లోకి వెళితే మంచు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, డైనమిక్ హీరో మంచు మనోజ్ కుమార్ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, శేఖర్ రాజాని దర్శకుడిగా పరిచయం చేస్తూ, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "ఊ కొడతారా....ఉలిక్కి పడతారా". ఈ సినిమా పేరే తమాషాగా ఉంది కదూ...! ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని మణికొండలో ఒక భారీ సెట్ ని వేయటం జరిగింది. ఒక భారీ మహల్ ను ఈ "ఊ కొడతారా....ఉలిక్కి పడతారా" సినిమా కోసం వేశారు. ఈ సెట్ కి గంధర్వ మహల్ అని పేరు పెట్టారు.

కోటి రూపాయలకు పైగా భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సెట్ కు ఈ సినిమాలో చాలా ప్రాథాన్యత ఉందని సమాచారం. ఈ సెట్ తాను దగ్గరుండి కట్టించినందుకు "నేను క్వాలిఫైడ్ కన్ స్ట్రక్షన్ వర్కర్ గా మారాను" అని మంచు లక్ష్మి అంటోంది. యువరత్న నందమూరి బాలకృష్ణ ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్న ఈ చిత్రం పందొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక సోషియో ఫాంటసీ కథతో నిర్మించబడుతోంది. ప్రముఖ యువ సినీ మాటల రచయిత లక్ష్మీ భూపాల్ ఈ చిత్రానికి మాటలు వ్రాస్తూండగా, బోబో శశి సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి "ఆర్య-2"ఫేం రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.