English | Telugu
హరీష్ శంకర్ వ్యాఖ్యలతో పవన్ ఫాన్స్ లో ఖుషి
Updated : Nov 8, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ ఫాన్స్ ఉస్తాద్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా పవన్ ఫ్యాన్ ట్విట్టర్ వేదికగా హరీష్ శంకర్ కి పవన్ నటించినఒక సినిమా సీన్ ని టాగ్ చేసాడు. దానికి హరీష్ తనదయిన స్టైల్లో రిప్లై ఇచ్చి పవన్ ఫాన్స్ లో హుషారు ని తీసుకొచ్చాడు.
పవన్ అభిమాని ఒకరు గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ అయిన అభిమన్యు సింగ్ కి పవన్ వార్నింగ్ ఇచ్చే ఇంటర్వెల్ సీన్ ని హరీష్ శంకర్ కిటాగ్ చేస్తూ.. ఈ వార్నింగ్ సీన్ ని మించిన సీన్ ఏ సినిమాలో అయినా ఉందా? ఒక వేళ ఉంటే చూపించండి అంటూ ఒక కొటేషన్ ని కూడా మెన్షన్ చేసాడు. దానికి హరీష్ శంకర్ యస్ బ్రో వెయిట్ ఫర్ ఉస్తాద్ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ని చూసి పవన్ ఫాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఖచ్చితంగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ సీన్ ని మించే స్థాయిలోనే ఉస్తాద్ ఇంటర్వెల్ సీన్ ఉండబోతుందని చెప్పకనే చెప్పాడని పవన్ ఫాన్స్ అంటున్నారు.
స్క్రీన్ మీద పవన్ ని పవర్ ఫుల్గాప్రెజెంట్ చెయ్యగల దర్శకుడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ కి వరుస ప్లాపుల నుంచి విముక్తిని కల్పించాడు. గబ్బర్ సింగ్ ని హరీష్ తెరకెక్కించిన విధానం సూపర్ గా ఉంటుంది. ఆ మూవీ తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో రికార్డులని కూడా సాధించింది. ఇప్పుడు ఆ రికార్డులన్ని కూడా ఉస్తాద్ భగత్ సింగ్ తో మాయం కావడం ఖాయమని పవన్ ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు.