English | Telugu

బాలకృష్ణ కాళ్ళకి సూర్య నమస్కరిస్తున్న వీడియోని బయటపెట్టింది ఎవరు

నందమూరి నటసింహం బాలకృష్ణ(balakrishna)హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్(un stoppble)సీజన్ 4 కొన్ని రోజుల క్రితం ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఈ షో లో మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)రాగా, రెండో ఎపిసోడ్ కి ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ హాజరయ్యాడు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ కి సూర్య(suriya)ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇందుకు సంబంధించిన ప్రోమో రీసెంట్ గా విడుదల అయ్యింది.'సింహం,సమరసింహం కలిసిన వేళ ఉండదా ఎంటర్ టైన్మెంట్ స్కై లెవల్ లోనా' అనే క్యాప్షన్ తో రిలీజైన ప్రోమోలో బాలకృష్ణ కాళ్ళకి సూర్య నమస్కరించడం, కార్తీ తో సూర్యకి ఎలాంటి అనుబంధం ఉంది. ఫోన్ లో కార్తీ పేరుని ఏమని సేవ్ చేసుకున్నాడు.ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా జరిగాయా,సూర్య లైఫ్ లో జ్యోతిక పాత్ర ఏంటి, సూర్య రియల్ లైఫ్ కి సినీ లైఫ్ కి సంబంధించి తేడా ఏంటి, సూర్య తన సీక్రెట్స్ ఎవరితో షేర్ చేసుకుంటాడు, బాలకృష్ణ, సూర్య కి ఐ లవ్ యు ఎందుకు చెప్పాడు, సూర్య చేసే సామాజిక సేవలు.ఇలాంటివన్నీ ఈ షో లో ప్రస్తావనకు రానున్నాయి.

టోటల్ గా ప్రోమో చూస్తుంటే ఈ ఎపిసోడ్ మొత్తం బాలయ్య, సూర్య ఫ్యాన్స్ కి ఒక సరికొత్త అనుభూతుని అందించడం ఖాయమని చెప్పవచ్చు.నవంబర్ 8 న ప్రోగ్రాం టెలికాస్ట్ కానుండగా ఇందులో సూర్య అప్ కమింగ్ మూవీ కంగువా దర్శకుడు శివ(siva)ప్రతినాయకుడుగా చేసిన బాబీడియోల్ కూడా పాల్గొనబోతున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.