English | Telugu

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 2 డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.దీంతో చిత్ర బృందం శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో ఉంది.పుష్ప మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 పై అల్లు అర్జున్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం పుష్ప 2 టీం పాటల చిత్రీకరణలో ఉందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.అందులో భాగంగా రామోజీఫిలిం సిటీ లో వేసిన ఒక భారీ సెట్ లో అల్లు అర్జున్ పై ఒక సోలో సాంగ్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. పుష్ప మొదటి భాగంలోని సోలో సాంగ్ ని మించి ఇప్పుడు చిత్రీకరించబోయే సాంగ్ ఉండబోతుందని, రచయిత చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ ని కూడా అందించాడనే మాటలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ వేసే స్టెప్ లకి విజిల్స్ తో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని కూడా అంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా చేస్తుండగా ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో ఇప్పటికే విడుదలైన రెండు పాటలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.