English | Telugu

సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెలుగు ఫిల్మ్.. ఫస్ట్ లుక్ అదిరింది!

తెలుగులో సూపర్ హీరో తరహా చిత్రాలు తక్కువే. కానీ సరిగ్గా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆ చిత్రాలూ ప్రూవ్ చేశాయి. త్వరలోనే తెలుగులో మరో సూపర్ హీరో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు 'ఏ మాస్టర్ పీస్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 'శుక్ర', 'మాట రాని మౌనమిది' సినిమాలతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న సుకు పూర్వాజ్ డైరెక్షన్ లో సినిమా బండి బ్యానర్ పై శ్రీకాంత్ కండ్రాగుల నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను విడుదల చేసింది మూవీ టీమ్.

'ఏ మాస్టర్ పీస్' అనే టైటిల్ కు తగ్గట్టుగానే ఓ మాస్టర్ పీస్ లాంటి సూపర్ హీరో సినిమా రాబోతోందని ఈ పోస్టర్ చూడగానే అర్థం అవుతోంది. ఇప్పటి వరకూ హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హీరోస్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందీ లుక్. ఇప్పటి వరకూ విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్న అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ పోస్టర్ లోనే అనేక విశేషాలు కనిపిస్తున్నాయి. టైటిల్ లోని ఏ అక్షరం నిప్పులు చిమ్ముతూ వలయాకారంలో ఉంది. ఆ వలయంలోని శక్తి హీరోకూ ఉందనే అర్థం వచ్చేలా అతని కుడిచేతికి సైతం అదే కనిపిస్తోంది. అతని వెనక శివలింగంతో పాటు.. నెలవంక నుంచి పౌర్ణమి వరకూ చంద్రుడి పరిణామక్రమం కూడా ఉంది. పోస్టర్ లో ఎక్కువ ఆసక్తి కలిగిస్తోన్న అంశం కూడా ఇదే. సింపుల్ గా కనిపిస్తున్నా చాలా పవర్ ఫుల్ పాత్రనే డిజైన్ చేసినట్టున్నాడు దర్శకుడు. హాలీవుడ్ రేంజ్ కంటెంట్ తో వస్తున్నారని అర్థం అవుతోంది.పెద్దలతో పాటు పిల్లలకు కూడా నచ్చేలా ఈ సూపర్ హీరో పాత్రను డిజైన్ చేశామని మూవీ టీం చెబుతోంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.