English | Telugu

'రాజా సాబ్' నుండి రెండు సర్ ప్రైజ్ లు.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!  

ఈ ఏడాది 'కల్కి 2898 AD' సినిమాతో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'సలార్-2', 'కల్కి-2' వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో 'రాజా సాబ్' మూవీ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం నుంచి త్వరలోనే టీజర్ విడుదల కానుంది. (The Raja Saab)

మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మూవీ 'రాజా సాబ్'. ప్రభాస్ విభిన్న గెటప్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలలో ప్రభాస్ లుక్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ కింగ్ గెటప్ లో ప్రభాస్ లుక్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఈ క్రేజీ మూవీ 2025, ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ డిసెంబర్ నెలాఖ‌రులోగా షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. అంతేకాదు వరుసగా ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ, ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారట. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబర్ 25న టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది. అలాగే సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో ఓ సాంగ్ ని కూడా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.