English | Telugu

సిల్క్ స్మిత గురించి మాజీప్రధాని ఇందిరాగాంధీ తెలుసుకున్న నిజం ఏంటి?

ప్రముఖ దివంగత నటి, డాన్సర్ అయిన సిల్క్ స్మిత(silk smitha)గురించి తెలియని దక్షిణ భారతీయసినీ ప్రేమికుడు లేడు.పదిహేడు సంవత్సరాల తన సినీ కెరీర్ లో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ,హిందీ భాషల్లో కలుపుని నాలుగు వందల యాభై సినిమాల్లో నటించిన ఘన చరిత్ర సిల్క్ స్మిత సొంతం.ప్రస్తుతం ఆమె జీవిత చరిత్ర ఆధారంగా 'సిల్క్ స్మిత' క్వీన్ ఆఫ్ ఆఫ్ ది సౌత్ అనే టాగ్ లైన్ తో ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది.తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో రిలీజ్ కానుండగా లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ని చిత్ర బృందం రిలీజ్ చెయ్యడం జరిగింది.

భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ(indira gandhi)కొన్నివార్తా పత్రికలతో పాటు,మాగజైన్లని చదువుతూ ఉంటుంది.వాటన్నింటిలోను సిల్క్ స్మిత గురించి చాలా గొప్పగా ఆర్టికల్స్ రాసి ఉంటాయి. దీంతో ఎవరు సిల్క్ స్మిత అని తన అసిస్టెంట్ ని అడగ్గానే, అతను ఐరన్ లేడి, మాగ్నటిక్ లేడీ అంటూ సిల్క్ స్మిత గురించి గొప్పగా చెప్తాడు.ఇలా స్టార్ట్ అయిన టీజర్ ఆ తర్వాత సిల్క్ స్మితకి పబ్లిక్ లో ఉన్న ఇమేజ్ తో పాటుగా తన లైఫ్ లో ఎదుర్కున్న బాధలు కూడా ఆమెకి గుర్తుకొస్తున్నట్టుగా చూపించారు. ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించదగ్గ ఇళయరాజా ఇచ్చిన ఆర్ ఆర్ అయితే ఒక రేంజ్ లో ఉంది.

ఇక సిల్క్ స్మితగా చంద్రిక రవి(chandrika ravi)చేస్తుండగా ఎస్ టి ఆర్ ఐ సినిమాస్ పతాకంపై విజయ్ అమృతా రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా జయరామ్(jayaram) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. వివిధ భాషలకి చెందిన నటులు నటిస్తుండగా రిలీజ్ డేట్ కూడా త్వరలోనే వెల్లడి కానుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.