English | Telugu

3000  జీతం అందుకున్న త్రివిక్రమ్  పుట్టిన రోజు  

నేడు మాటల మాంత్రికుడు, గురూజీ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు. అప్పుడే పుట్టిన బిడ్డ ని ఆప్యాయంగా చూస్తూ తల్లి ,ఎదిగిన కొడుకుని చూసి గర్వంతో తండ్రి పొందే ఆనందం ఎలా ఉంటుందో ఆయన మాటలు ,సినిమాలు కూడా అంతే ఆనందాన్ని ఇస్తాయి. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమా అనే ఒక బ్రాండ్ ని ఆయన ప్రేక్షకుల దృష్టిలో ఏర్పాటు చేసుకున్నాడు.ఈ నవంబర్ 7 తో 52 సంవత్సరాలని పూర్తి చేసుకుంటున్న త్రివిక్రమ్ కి మన తెలుగు వన్ నుంచి బర్త్ డే విషెస్..

త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలుపేరు ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ. ఎమ్ ఏ న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఆయన తన కలానికి పెట్టుకున్న త్రివిక్రమ్ అనే పేరుతో కొన్ని దిన పత్రికలకి రచనలని రాయడం ప్రారంభించాడు. నెలకి 3000 వేల రూపాయల జీతంతో ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీ లో సినిమాలకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి కంటెంట్ రైటర్ గా కూడా త్రివిక్రమ్ వర్క్ చేసాడు. ఆ తర్వాత ప్రముఖ సినిమా రైటర్ పోసాని కృష్ణ మురళి, దర్శకులైన ముత్యాల సుబ్బయ్య ,ఈవివి సత్యనారాయణ, బి.గోపాల్ లాంటి దిగ్గజాల దగ్గర అసిస్టెంట్ రైటర్ గా త్రివిక్రమ్ పనిచేసాడు.
1992 వ సంవత్సరంలో వేణు తొట్టెంపూడి హీరోగా వచ్చిన స్వయంవరం అనే మూవీతో డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ సినిమా విజయానికి తివిక్రమ్ మాటలే ప్రధాన కారణం అనేది అక్షర సత్యం. అక్కడ నుంచి ఆయన మాటల గిలిగింతల ప్రవాహంలో తెలుగు సినిమాతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ప్రవహిస్తూనే ఉన్నారు. చిరునవ్వుతో, మల్లేశ్వరి, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ , జై చిరంజీవ, మన్మధుడు ఇలా ఎన్నో సినిమాలకి తన మాటల సుగంధాలని అద్ది ప్రేక్షకుల దృష్టిలో ఆ సినిమాల పరిమళం నేటికీ వెదజిల్లుతూనే ఉండేలా చేసాడు.

వెండి తెర మీద ఆయన ప్రభావం కేవలం మాటలతోనే ఆగకుండా దర్శకుడిగా కూడా 2002 లో తరుణ్ హీరో గా వచ్చిన నువ్వే నువ్వే అనే సినిమాతో ప్రారంభం అయ్యింది. ఇక అక్కడ నుంచి త్రివిక్రమ్ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అతడు,జల్సా, ఖలేజా, జులాయి ,అత్తారింటికి దారేది, సన్ అఫ్ సత్య మూర్తి, అరవింద సమేత, అల వైకుంఠ పురంలో ఇలా ఎన్నో సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకుల కుటుంబ సభ్యుడు గా త్రివిక్రమ్ మారాడు. ఆయన తన ప్రతి సినిమాని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే విధంగా తెరకెక్కిస్తాడు. ఆయన సినిమాలోని హీరో హీరోయిన్ లు ప్రేక్షకులకి ఎంతగా నచ్చుతారో ఆయన సినిమాలోని విలన్ కూడా అంతే స్థాయిలో ప్రేక్షకులకి నచ్చుతాడు. పొదుపు మాటలతో భారీగా నవ్వించే త్రివిక్రమ్ కి మరో సారి మన తెలుగు వన్ తరుపున జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ త్రివిక్రమ్ సర్ మహేష్ బాబు హీరోగా మీరు తెరకెక్కిస్తున్న గుంటూరు కారం మూవీ అఖండ విజయం సాధించాలని అలాగే మీరు మరిన్ని మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలని కోరుకుంటూ గురూజీ ఒన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే .

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.