English | Telugu

నీదీ నాదీ.. ఒక‌టే సినిమా అంటున్న త్రిష!

త్రిష ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అవుతున్నారు. పొన్నియిన్ సెల్వ‌న్ రిలీజ్‌కి ముందు త్రిష కెరీర్ ఫేడ‌వుట్ అయింద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ పొన్నియిన్ సెల్వ‌న్ ప్ర‌మోష‌న్స్ లో త్రిష‌ను చూసిన వారంద‌రూ వావ్‌... ఇంతందంగా ఉన్నారేంటి అని నోరెళ్ల‌బెట్టేశారు. త్రిష బౌన్స్ బ్యాక్ అయ్యార‌ని ఫ్యాన్స్ సంబ‌ర‌పడిపోయారు. మ‌ణిర‌త్నం మూవీ ప్ర‌మోష‌న్ల‌లోనే కాదు, ఇటీవ‌ల విజ‌య్ 67వ సినిమా లియో పూజా కార్య‌క్ర‌మాల్లోనూ త్రిష గ్రేస్ మ‌రో లెవ‌ల్లో క‌నిపించింది.

త్రిష కొస‌రి కొస‌రి మాట‌లు చెబుతుంటే విజ‌య్ కూడా సిగ్గుప‌డుతూ, న‌వ్వుతూ త‌ల‌దించుకున్న ఫొటోల‌ను అదే ప‌నిగా షేర్ చేస్తున్నారు అభిమానులు.అంతా పాజిటివ్‌గా క‌నిపిస్తున్న ఈ త‌రుణంలో, త్రిష - విజ‌య్‌కి సంబంధించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ విష‌యం వైర‌ల్ అవుతోంది. లియో విజయ్ నటిస్తున్న 67వ సినిమా మాత్ర‌మే కాదు, త్రిష న‌టిస్తున్న 67వ చిత్రం కూడా అట‌. ఒక హీరోకీ, హీరోయిన్‌కీ సేమ్ నెంబ‌ర్ రావ‌డం అనేది ఎవ‌రూ ఊహించ‌ని విష‌యం. ఒక‌వేళ గ‌తంలో ఎవ‌రికైనా ఇలాంటి విష‌యం జ‌రిగినా, దాన్ని ఎవ‌రూ గుర్తించి, ఇలా మాట్లాడుకున్న సంద‌ర్భాలైతే లేవు.

అందుకే ఇప్పుడు విజ‌య్‌, త్రిష ఫ్యాన్స్ ఈ అకేష‌న్‌ని సెల‌బ్రేట్ చేస్తున్నారు.అస‌లు ఈ విష‌యం త‌న‌కు తెలియ‌నే తెలియ‌ద‌ని అంటున్నారు డైర‌క్ట‌ర్ లోకేష్ క‌న‌గరాజ్‌. లియో సినిమాలో హీరోయిన్‌కి త్రిష ప‌ర్ఫెక్ట్ గా సూట్ అవుతార‌ని మాత్రం సెల‌క్ట్ చేసుకున్న‌ట్టు చెప్పారు. ఆల్రెడీ ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నాలుగు సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌డంతో, ఆ కెమిస్ట్రీ త‌న సినిమాకు కూడా బాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని మాత్రం అనుకున్నార‌ట మాస్ట‌ర్ డైర‌క్ట‌ర్‌. త్వ‌ర‌లోనే కాశ్మీర్‌లో షెడ్యూల్ మొద‌లుపెట్ట‌బోతున్నారు లియో టీమ్‌.