English | Telugu

త్రిష ఇంకా తగ్గించడం లేదు..!

నటించేందుకు సినిమాలు లేకపోయినా పారితోషకం విషయంలో మాత్రం వెనక్కి తగ్గనంటుంది త్రిష. గ‌త రెండు మూడేళ్లుగా త్రిష‌కు సరైన సినిమాలు లేవు. ఆమెను దర్శకులు పట్టించుకోవడం కూడా మానేశారు. ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు. చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకుంటారు. కానీ త్రిష మాత్రం రివర్స్ లో వెళుతుంది. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం క్వీన్ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసేందుకు ఓ ప్రొడ్యూసర్ రెడీ అయ్యాడు. ఆ సినిమా కోసం త్రిషని సంప్రదిస్తే కోటి పాతిక లక్షలు ఇస్తానంటేనే సినిమా చేస్తానని లేకపోతే చేయనని చెప్పేసరికి నిర్మాత సైలెంట్‌గా జారుకున్నాడట. ఇప్పుడు ఆ నిర్మాత అదే కోటి రూపాలయకి టాప్ హీరోయిన్ తీసుకొనే పనిలో వున్నాడట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.