English | Telugu

త్రిష పెళ్లి కబుర్లు

మాటలు నేర్చిన చిలకను రామా అనమంటే రానూ అందట. చెన్నై చంద్ర త్రిష పలుకులు వింటే అలాగే ఉన్నాయి మరి. మొన్న పెళ్లంది వెంటనే వదిలేసా అంది. నిన్న వేదాంతం చెప్పింది. మళ్లీ పెళ్లి కబుర్లు చెబుతోంది. వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం అయిపోయింది...మూడుముళ్లు తరువాయి అనుకుంటే బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత వరుణ్ గురించి ఎవరు ప్రస్తావించినా వేదాంతం చెప్పింది. ఆఫర్లివ్వండంటూ వెంట పడింది.

ఇంతలో ఏమైందో ఏమో....లోకంలో పెళ్లికొడుకులకే కొదువా? వరుణ్ కి బాబులాంటోడు దొరక్కపోడు...త్వరలోనే ఓ ఇంటిదాన్ని అవకపోను అని తెగ హొయలు పోతోందట. ఈ మాటలు విన్న జనాలకు చెన్నై బ్యూటికి పెళ్లి పిచ్చి పట్టిందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో త్రిష...వరుణ్ ని వద్దందా....లేదా అమ్మడిజోరు కుర్రాడు తట్టుకోలేకపోయాడా? అని అనుకుంటున్నారు. ఏదైనా కానీ చెన్నై చిలుక మళ్లీ పెళ్లి పలుకులు పలుకుతోంది. ఈసారి వరుడెవ్వరో వెయిట్ అండ్ సీ!

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.