English | Telugu

ప్ర‌భాస్ అడ్డాలో... అదిరిపోయే ర్యాలీ!

బాహుబ‌లి ఫీవ‌ర్ మామూలుగా లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులు ఈ సినిమా గురించే మాట్లాడుకొంటున్నారు. అలాంట‌ప్పుడు ప్ర‌భాస్ అడ్డా భీమ‌వ‌రంలో ప‌రిస్థ‌తి మామూలుగా ఉంటుందా? అక్క‌డ ఏకంగా పండ‌గ సంబ‌రాలే చేసుకొంటున్నారు అభిమానులు. గురువారం అర్థరాత్రి బెనిఫిట్ షో పూర్త‌య్యాక 3 ఏనుగులు 40 గుర్రాలు, 150 ఎన్‌ఫీల్డ్ బైకులూ, 5 వేల‌మంది అభిమానుల‌తో భీమ‌వ‌రంలో క‌నీ వినీ ఎరుగని ర్యాలీ నిర్వ‌హించ‌డానికి అభిమానులు స‌న్నాహాలు చేసుకొంటున్నారు.

భీమ‌వ‌రంలోనే కాదు, ఆ చుట్టు ప‌క్క‌న గ్రామాల్లోనూ ఈ ర్యాలీ నిర్వ‌హిస్తారు. అయితే పోలీసు శాఖ మాత్రం ర్యాలీలో ఏనుగుల‌ను తీసుకురావ‌డానికి అనుమ‌తులు ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. బాణ సంచా ధాటికి ఏనుగులు చెల్లాచెదుర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఒక వేళ ఏనుగుల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోతే.. మ‌రో 20 గుర్రాల‌ను స‌మీక‌రించి... ర్యాలీని అట్ట‌హాసంగా జ‌ర‌పాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

మొత్తానికి ఓ సినిమా కోసం ఈ స్థాయిలో ర్యాలీ నిర్వ‌హించ‌డం టాలీవుడ్‌లోనే చ‌ర్చ‌నీయాంశ‌మైంది. భీమ‌వ‌రం బుల్లోళ్ల హ‌డావుడి చూసి.. నైజాంలో ఉన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్ కూడా ఈ త‌ర‌హా.. ర్యాలీ ఒక‌టి నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.