English | Telugu
ఈ వారం ఓటీటీలో 24 సినిమాలు రిలీజ్!
Updated : Sep 27, 2023
ఈమధ్య థియేటర్లతో ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ప్రతి వారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయినట్టు ఓటీటీలో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కంటే ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. వివిధ భాషలకు చెందిన 24 సినిమాలు ఈవారం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. వాటిలో ఖుషి, ఏజెంట్ చిత్రాలతోపాటు కుమారి శ్రీమతి, పాపం పనివాడు వంటి వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి.
ఇక ఈ వారం థియేటర్లలో రెండు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అవి ‘స్కంద’, ‘చంద్రముఖి 2’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్, శ్రీలీల జంటగా నటించిన ‘స్కంద’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏమేరకు రీచ్ అవుతుందో చూడాలి. ఇక రెండో సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ‘చంద్రముఖి’ చిత్రానికి ఇది సీక్వెల్. లారెన్స్, కంగనా రనౌత్ నటించిన ఈ సినిమాకి పి.వాసు దర్శకత్వం వహించారు. 2005లో సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘చంద్రముఖి’ ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 18 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ విడుదలవుతోంది. ఈ సినిమా మళ్ళీ అంతటి భారీ విజయాన్ని అందుకుంటుందా లేదా ప్రేక్షకులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ 28న విడుదలవుతుండగా, విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘పెదకాపు 1’ సెప్టెంబర్ 29న రిలీజ్ అవుతోంది. పై రెండు సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ మూవీగా ‘పెదకాపు 1’ రూపొందింది.
ఈ వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో కలిపి వివిధ భాషలకు చెందిన 24 సినిమాలు విడుదలవుతున్నాయి.
నెట్‌ఫ్లిక్స్:
1. లిటిల్ బేబీ బమ్: మ్యూజిక్ టైమ్(ఇంగ్లీష్ సిరీస్), 2. ద డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్), 3. ఓవర్‌హౌల్ (పోర్చుగీస్ మూవీ), 4. స్వీట్ ఫ్లో 2 (ఫ్రెంచ్ చిత్రం), 5. ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ (ఇంగ్లీష్ సినిమా), 6. ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (ఇంగ్లీష్ మూవీ), 7. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్, 8. ఫెయిర్ ప్లే, 9. చూనా (హిందీ సిరీస్), 10. నో వేర్ (స్పానిష్ సినిమా), 11. రెప్టైల్ (ఇంగ్లీష్ మూవీ), 12. ఖుషి (తెలుగు సినిమా), 13. స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ (ఇంగ్లీష్ సినిమా)
అమెజాన్ ప్రైమ్:
14. హాస్టల్ డేజ్ సీజన్ 4 (హిందీ సిరీస్), 15. కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్), 16. డోబుల్ డిస్కోర్షో (స్పానిష్ చిత్రం)
హాట్‌స్టార్:
17. కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా), 18. లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్), 19. తుమ్ సే నా హో పాయేగా (హిందీ సినిమా)
ఆహా:
20. పాపం పసివాడు (తెలుగు సిరీస్), 21. డర్టీ హరి (తమిళ చిత్రం)
సోనీ లివ్:
22. చార్లీ చోప్రా (హిందీ సిరీస్), 23. ఏజెంట్ (తెలుగు మూవీ), 24. అడిjైు! (తమిళ సినిమా)