English | Telugu
పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తో బాక్సాఫీస్ బరిలో విక్రమ్!
Updated : Oct 27, 2023
చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
'తంగలాన్' సినిమాను జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'తంగలాన్' రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో చియాన్ విక్రమ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. విక్రమ్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ లో తన నటనతో సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది. నవంబర్ 1న 'తంగలాన్' సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.