English | Telugu
ప్రభాస్ ఫాన్స్ ఎగరేయండి కాలర్..సలార్ ఉత్తరాంధ్ర రికార్డు
Updated : Oct 27, 2023
డిసెంబర్ 22 కి ఉన్న స్పెషల్ ఏంటి అని ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎవర్నడిగినా వెంటనే చెప్తారు. అంతలా ఆ డేట్ ఇప్పుడు భారతీయుల్లో స్థానాన్ని సంపాదించింది. డిసెంబర్ 22 న ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి ముందే సలార్ గురించి రోజుకో వార్త ఫిలిం మార్కెట్ లో చక్కర్లు కొడుతుంది. తాజాగా సలార్ మూవీ కి సంబంధించిన రికార్డు ఒకటి బయటకి వచ్చి ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేస్తుంది.ప్రభాస్ సలార్ సినిమా ఆల్ ఏరియాస్ లో కూడా రికార్డు లెవెల్లో బిజినెస్ ని జరుపుకుంటుంది. ఒక్కో ఏరియాలో ఒక్కో రికార్డు ని సాధించుకుంటు భారతీయ చిత్రపరిశ్రమ ఖ్యాతిని పెంచుతుంది. తాజాగా ఉత్తరాంధ్రకి సంబంధించిన సలార్ రికార్డు ఒకటి బయటకి వచ్చింది. సలార్ మూవీ ఉత్తరాంధ్ర ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులని 20 కోట్ల రూపాయలకి ప్రముఖ పంపిణీదారులు తీసుకున్నారు.ఇప్పుడు ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరో సినిమా సలార్ రిలీజ్ కి ముందే సరికొత్త రికార్డు లని సృష్టిస్తుంటే రిలీజ్ అయ్యాక మరిన్ని కొత్త రికార్డు లు సృష్టించడం ఖాయమని అంటున్నారు.