English | Telugu

తమ్ముడు కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా..?

నితిన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. 2020లో వచ్చిన 'భీష్మ' వంటి ఘన విజయం తర్వాత.. వరుసగా ఐదు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూసిన నితిన్.. ఇప్పుడు 'తమ్ముడు'తో డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ కొట్టబోతున్నాడు.

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'తమ్ముడు' చిత్రం జూలై 4న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న తమ్ముడు.. వసూళ్ల పరంగా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.3 కోట్లు గ్రాస్ రాబట్టగా, రెండో రోజు రూ.1.5 కోట్ల గ్రాస్ రాబట్టిందని అంచనా. అంటే రెండు రోజులు కలిపి కనీసం ఐదు కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది.

'తమ్ముడు' సినిమా బడ్జెట్ దాదాపు రూ.70 కోట్లు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.35 కోట్లు కవర్ అయ్యాయి. ఇప్పుడు థియేటర్లలో కనీస వసూళ్ళు రాబట్టలేక డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. దాంతో నితిన్ మరో పరాజయాన్ని ఖాతాలో వేసుకోబోతున్నాడు.

నితిన్ తదుపరి చిత్రం 'ఎల్లమ్మ'. దీనికి బలగం ఫేమ్ వేణు దర్శకుడు. ఈ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత కావడం విశేషం. మరి ఈ సినిమాతోనైనా నితిన్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.