English | Telugu

రాజా సాబ్ కి పోటీగా ధురంధర్.. షాక్ తప్పదా..!

ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ గా చేసుకొని విడుదలవుతాయి అనడంలో సందేహం లేదు. ప్రభాస్ నుంచి రానున్న నెక్స్ట్ మూవీ 'ది రాజా సాబ్'. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్.. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాన్ ఇండియా వైడ్ గా 'రాజా సాబ్' మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే అదే రోజు ఓ భారీ బాలీవుడ్ ఫిల్మ్ విడుదలవుతోంది. దీంతో నార్త్ లో 'రాజా సాబ్' వసూళ్లపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రణవీర్ సింగ్ నెక్స్ట్ మూవీ 'ధురంధర్'. 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌' తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. పైగా ఇందులో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాంతో హిందీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ను డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ టీజర్ ను వదిలారు. ఈ టీజర్ యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఉంది. కొంతకాలంగా హిందీ మార్కెట్ లో యాక్షన్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సౌత్ నుంచి వెళ్ళిన 'కేజీఎఫ్-2', 'పుష్ప-2' వంటి సినిమాలు సైతం అక్కడ సంచలన వసూళ్ళు సాధించాయి. అలాంటిది బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్'ను వారు ఓన్ చేసుకోవడంలో ఆశ్చర్యంలేదు. అదే జరిగితే 'రాజా సాబ్' హిందీ వసూళ్లపై ప్రభావం పడే అవకాశముంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. తన స్టార్డంతో హిందీ మార్కెట్ లో హిందీ సినిమాకే షాకిచ్చిన ఆశ్చర్య పడాల్సిన అవసరంలేదు. చూద్దాం మరి 'రాజా సాబ్' ఏం చేస్తాడో.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.