English | Telugu
గేమ్ చేంజర్ విషయంలో మాట మార్చిన థమన్..జరగండి పక్కకి అంతే
Updated : Mar 19, 2025
తన మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా హిట్ రేంజ్ ని పెంచే సంగీత దర్శకుల్లో తమన్(Thaman)కూడా ఒకడు.దశాబ్దంన్నరగా అద్భుతమైన ట్యూన్స్ తో సంగీత ప్రియులని అలరిస్తు వస్తున్నాడు.ప్రస్తుతం ది రాజాసాబ్,అఖండ 2 ,ఓజి వంటి బిగ్ ప్రాజెక్ట్స్ థమన్ ఖాతాలో ఉన్నాయి.రీసెంట్ గా థమన్ ఒక పాడ్ కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
అందులో రామ్ చరణ్(Ram Charan)శంకర్(Shankar)తన కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్(Game Changer)మూవీలోని సాంగ్స్ గురించి మాట్లాడుతు గేమ్ చేంజర్ సాంగ్స్ హిట్ కాకపోవడానికి కారణం ఒక్క పాటలో అయినా హుక్ స్టెప్ లేదు.అందుకే సాంగ్స్ అంత హిట్ కాలేదు.అల వైకుంఠపురములో ప్రతీ సాంగ్ లో హుక్ స్టెప్ ఉందంటూ చెప్పుకొచ్చాడు.ఇదే థమన్ గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ లో మాట్లాడుతు మూవీలో సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.ముఖ్యంగా 'జరగండి' సాంగ్ ఒక్క దానికే ఆడియెన్స్ పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయని మాట్లాడాడు.దీంతో థమన్ మాటలు మార్చిన తీరుపై నెటిజన్స్ సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ది రాజాసాబ్'(The Raja saab)సాంగ్స్ గురించి థమన్ మాట్లాడుతు రాజాసాబ్ కోసం కంపోజ్ చేసిన పాటలన్నీ అవుట్ డేటెడ్ అయిపోయాయి. మళ్ళీ కొత్త సాంగ్స్ రెడీ చేసే పనిలో ఉన్నాను.ఎందుకంటే అవి చాలా రోజుల క్రితం కంపోజ్ చేసిన పాటలు.ప్రెజంట్ ట్రెండ్, టెక్నాలజీ మారిపోయాయి. అందుకు తగ్గట్టుగా సాంగ్స్ ఇవ్వాలి. సాంగ్స్ మళ్ళీ కంపోజ్ చేయాలనే నిర్ణయం కూడా నాదే.ప్రభాస్ మూవీ కాబట్టి ఆడియో కంపెనీలు ఒక్కో ఆల్బమ్ కి 30 ,40 కోట్లు ఖర్చు పెడుతున్నాయి.అందుకే మంచి మ్యూజిక్ అందించాల్సిన బాధ్యత తనపై ఉంది కాబట్టి మళ్ళీ కొత్త ఆల్బం చేస్తున్నాని చెప్పుకొచ్చాడు.