English | Telugu

ఇక్క‌డ్నుంచే టెంప‌ర్‌, ప‌టాస్ ఎత్తేశారు!

టెంప‌ర్‌, ప‌టాస్‌.. రెండు క‌థ‌ల్లో ఓ సారుప్య‌త క‌నిపిస్తుంది. అవినీతి ప‌రుడై, లంచాల రుచి మ‌రిగిన ఓ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా మంచివాడుగా మారాడు, ఎలా శ‌త్రుసంహారం చేశాడ‌న్న‌దే క‌థ‌. ప‌టాస్ నుంచే టెంప‌ర్ పాయింట్ ఎత్త‌క‌పోయినా ఈ రెండు క‌థ‌లూ ఓ సినిమా నుంచి స్ఫూర్తి పొందాయి. అదే.. విజ‌య్ న‌టించిన జిల్లా.

ఈసినిమా శుక్ర‌వారం తెలుగు ప్రేక్ష‌కుల ముందొచ్చినా త‌మిళంలో విడుద‌లై దాదాపుగా రెండేళ్లు కావొస్తుంది. అందులోనూ ఇదే పాయింట్‌. పోలీస్ అంటే విర‌క్తి పెంచుకొన్న హీరో - అనుకోని ప‌రిస్థితుల్లో పోలీస్ అవ‌తారం ఎత్తుతాడు. లంచాల రుచి మ‌రిగి, దుర్మార్గుల‌కు చేయూత నిస్తాడు. చివ‌రికి ఎలా మంచివాడ‌య్యాడ‌న్న‌దే పాయింట్‌. టెంప‌ర్‌, ప‌టాస్ ల కు స్ఫూర్తి కూడా ఈ క‌థే! అంటే అన్న‌ద‌మ్ములిద్ద‌రూ క‌ల‌సి ఓ త‌మిళ సినిమానే కాపీ కొట్టార‌న్న‌మాట‌.