English | Telugu

సెట్లో మిస్‌బిహేవ్ చేసిన స్టార్ క‌మెడియ‌న్‌!

స్టార్ అనే హోదా నెత్తిమీద కొమ్ముల్ని తీసుకొస్తుంద‌న‌డానికి ఇది మ‌రో నిద‌ర్శ‌నం. హీరోలే కాదు. స్టార్ హోదా వ‌స్తే...క‌మెడియ‌న్లూ పోజులు కొడ‌తారు. తెలుగు తెర‌పై తిరుగులేని క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకొని, ల‌క్ష‌ల పారితోషికాలు అందుకొంటున్న ఓ బ‌డా హాస్య‌న‌టుడు సెట్లో ఓ అమ్మాయితో మిస్ బిహేవ్ చేసిన సంగ‌తి ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.

ఓ స్టార్ క‌మెడియ‌న్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌తో వెకిలివేషాలు వేయ‌డానికి ప్ర‌చ‌త్నించాడ‌ని, ఆ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, స‌ద‌రు స్టార్ క‌మెడియ‌న్‌కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకొంటున్నాయి. ఆ క‌మెడియ‌న్ ఎవ‌రు అనే విష‌యంపై టాలీవుడ్‌లో పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఇది వ‌ర‌కు కూడా ఓ యాంక‌ర్ తో ఇలానే స‌ర‌సాలాడ్డానికి ప్ర‌య‌త్నించి.. భంగ‌ప‌డ్డాడ‌ట‌. ఇప్పుడు మ‌రోసారి సెట్లో అంద‌రి ముందు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

సెట్లో ద‌ర్శ‌కుడు, నిర్మాత‌ల ముందే ఈ స్టార్ క‌మెడియ‌న్‌ని ఆ కాస్ట్యూమ్ డిజైన‌ర్ చ‌డామ‌డా తిట్టేయ‌డంతో... షాక్‌కి గురై సెట్ వ‌దిలి అర్థాంత‌రంగా వెళ్లిపోయాడ‌ట‌. ఈ ఉదంతంతో ఆ స్టార్ క‌మెడియ‌న్ ప‌రువు కాస్త పోయిన‌ట్టైంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకొంటున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి వేషాలేయ‌డం మానేసి, తెర‌పై వేసుకొనే వేషాల‌పై దృష్టి పెడితే బాగుంటుంద‌ని ఆ క‌మెడియ‌న్ కు కొంత‌మంది స‌ల‌హాలూ ఇస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా ఆయ‌న మార‌తారో, లేదో?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.