English | Telugu
శ్రీమంతుడు చూసి బోరుమంటున్న హీరోలు
Updated : Aug 11, 2015
హిట్ సినిమా కథలు దొరకడం గగనమైపోయింది. అలాంటిది ఓ మంచి కథ దొరికనప్పుడు వలుకోవడం దురదృష్టమే. అలాంటి అవకాశం ఇద్దరు హీరోలకు అందినట్టే అంది చేజారిపోయింది. దాంతో.. ఆ హీరోలిద్దరూ ఫీలైపోతున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడు శ్రీమంతుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా అందరి మొహాల్లో కొత్త కాంతులు తెచ్చింది. ఇద్దరు మాత్రం ఈ సినిమా రిజల్ట్ చూసి పీలవుతున్నారు. వాళ్లే రామ్‌చరణ్, ఎన్టీఆర్.
శ్రీమంతుడు కథని ముందుగా రామ్‌చరణ్ కే వినిపించాడు కొరటాల శివ. ఆ సినిమా కొబ్బరికాయ్ కొట్టుకొని ఆగిపోయింది. కథలో అంత దమ్ములేదు, నాకు కావల్సిన మాస్ అంశాలేం లేవు.. అని ఈ సినిమాని చరణ్ పక్కన పెట్టడంతో ఈ సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ తరవాత ఎన్టీఆర్‌కీ ఈ కథే వినిపించాడట కొరటాల శివ. అప్పుడు టెంపర్ మోజులో ఉన్న ఎన్టీఆర్ `తరవాత చూద్దాంలే` అని ఈ స్ర్కిప్టుని పక్కన పెట్టేశాడని టాక్. దాంతో శ్రీమంతుడు సినిమాని మహేష్ బాబుతో తీసేశాడు కొరటాల. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దాంతో.. ఆ హీరోలిద్దరూ వంద కోట్ల సినిమా మిస్సయిపోయారు.