English | Telugu

థియేటర్స్‌లో యూత్‌కి పిచ్చెక్కించి.. ఏడేళ్లుగా ఓటీటీలో ట్రెండ్‌ అవుతున్న తెలుగు సినిమా!

ఇటీవలికాలంలో థియేటర్స్‌లో కంటే ఓటీటీల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు, ఎంజాయ్‌ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు పోటాపోటీగా కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. దీంతో అన్ని భాషల సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్‌ అయి బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచినా ఓటీటీకి వచ్చిన తర్వాత కొంతకాలం మాత్రమే ట్రెండింగ్‌లో ఉంటాయి. కానీ, ఒక సినిమా మాత్రం ఏడేళ్లుగా ఓటీటీలో అదే క్రేజ్‌తో రన్‌ అవుతోందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ సినిమా పేరు ‘ఆర్‌ఎక్స్‌100’.

కార్తికేయ, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందించిన వయొలెంట్‌ లవ్‌స్టోరీ ‘ఆర్‌ఎక్స్‌100’. 2018 జూలై 12న విడుదలైన ఈ సినిమా యూత్‌కి విపరీతంగా నచ్చింది. సినిమాలోని రొమాంటిక్‌ సీన్స్‌, మధురమైన పాటలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 25 కోట్లు కలెక్ట్‌ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. సినిమా రిలీజ్‌ అయిన నాలుగు వారాల తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత హాట్‌స్టార్‌లో హిందీ వెర్షన్‌ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ట్రెండింగ్‌లోనే ఉంది. ఇప్పటికీ ఈ సినిమాను చాలా మంది చూస్తున్నారు. యూట్యూబ్‌లో హిందీ, మలయాళం వెర్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఈ సినిమాకి ఇంత క్రేజ్‌ రావడానికి ముఖ్య కారణంగా హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ అని చెప్పుకోవచ్చు. తన గ్లామర్‌తో యూత్‌కి డ్రీమ్‌గర్ల్‌గా మారిపోయింది. కార్తికేయతో కలిసి పాయల్‌ చేసిన రొమాంటిక్‌ సీన్స్‌ కుర్రాళ్ళకు పిచ్చెక్కించాయి. ఇక సినిమాలోని పాటల ఒక రేంజ్‌లో హిట్‌ అయ్యాయి. ఇలా.. ‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాకి ఏడేళ్ళ క్రితం థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చిందో.. అదే రెస్పాన్స్‌ ఓటీటీలో ఏడేళ్ళుగా కొనసాగుతోందంటే దానికి కారణం.. రిపీట్‌గా ఆడియన్స్‌ ఈ సినిమాను చూడడమే. ఈ సినిమా తర్వాత హీరోగా కార్తికేయ, హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ బాగా బిజీ అయిపోయారు. పాయల్‌ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది.