English | Telugu

ఏది నిజమైన ప్రేమ.. ప్రతి ఆడపిల్ల నాలాగే ఉండాలి

కెరీర్ పరంగా ప్రస్తుతం 'సమంత'(samanth)కొంచం స్లో అయినా, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన స్థానం పదిలం. అంతలా ఎన్నో హిట్ చిత్రాల్లో మరిచిపోలేని క్యారెక్టర్స్ ని పోషించింది. అగ్ర హీరో సినిమా అయినా కూడా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకుందంటే, సమంత నటనకి ఉన్న శక్తీ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే సమంత రీసెంట్ గా ఇనిస్టాగ్రమ్ వేదికగా స్పందిస్తు ఇరవై సంవత్సరాల వయసులో నిజమైన ప్రేమ గురించి నాకు ఎవరు చెప్పలేదు. ప్రేమ అనేది మనలోనే ఉంటుందని, బయట నుంచి రాదని,మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని తర్వాత అర్ధం చేసుకున్నాను. ఇరవై, ముప్పై సంవత్సరాల వయసు మధ్య మహిళలు చూసే ప్రతి విషయం ఎంతో భిన్నంగా ఉంటుంది. నేను నా మేకప్ మాన్ రీసెంట్ గా ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. ముప్పై ఏళ్ళ తర్వాత ప్రపంచాన్ని చూసే తీరు మారిపోతుంది. అందం, మెరుపుతో పాటు చాలా విషయాల్లో మార్పు వస్తుంది. అందుకే జీవితాన్ని ఆస్వాదించాలంటే ఇరవైలలోనే చేయాలి.

నేను ఇరవై లో ఉన్నపుడు గుర్తింపు కోసం ఆరాటపడుతు గందరగోళంగా గడిపాను. ఆ టైం లో నన్ను నేను ఎంత కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ముప్పైలో ఉన్నాను. గతంలో నేను చేసిన తప్పుల తాలూకు జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం మానెయ్యడంతో పాటు, అన్నిటి వెంట పరుగులు తీయ్యడం ఆపేసాను. పబ్లిక్ లో ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా ఉండటం కూడా మానేసాను. ప్రతి అమ్మాయి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మీలా ఉంటేనే సంతోషంగా, స్వేచ్ఛగా ఉండగలరు అని సుదీర్ఘ పోస్ట్ చేసింది. సమంత రెండు పదుల వయసు నుంచే నాగచైతన్య(Naga Chaitanya)ని ప్రేమించడం, ఆ ప్రేమ పెళ్లి దాకా వెళ్లి, విడాకులు తీసుకోవడం తెలిసిందే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.