English | Telugu

వెంకటేష్ కొత్త ఇల్లు మణికొండలో

వెంకటేష్ కొత్త ఇల్లు మణికొండలో కట్టుకున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు హీరో విక్టరీ వెంకటేష్ మణి కొండలో కొత్త ఇల్లు కట్టుకుని ఇటీవలే ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. తనకు అత్యంత ఆత్మీయులైన అతి కొద్దిమందిని మాత్రమే ఈ గృహప్రవేశానికి వెంకటేష్ పిలిచారు. అన్ని ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ ఇల్లు కట్టటానికి పది కోట్లకు పైగా డబ్బు ఖర్చయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ ఇల్లుని నాలుగు ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించారు.

మెగాస్టార్ చిరంజీవి ఇల్లు కన్నా వెంకటేష్ ఇల్లు పెద్దది. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రముఖ బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ఇల్లుకి కుడిఎడంగా సరిపోతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న "బాడీగార్డ్" సినిమాలో హీరోగా నటిస్తున్నారు. దీని తర్వాత దశరథ్ దర్శకత్వంలోని సినిమాలో హీరోగా నటించటానికి వెంకటేష్ అంగీకరించారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.