English | Telugu

బెజవాడరౌడీలు పేరుపై వర్మ కమిట్ మెంట్

"బెజవాడరౌడీలు" పేరుపై వర్మ కమిట్ మెంట్ ఎంతబలంగా ఉందంటే ఆరునూరైనా ఆ సినిమా పేరుని మార్చేదిలేదని పట్టుబట్టాడు. వివరాల్లోకి వెళితే శ్రేయ ఫిలింస్ పతాకంపై, యువహీరో నాగచైతన్య హీరోగా, వివేక్ కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కిరణ్ కుమార్ కోనేరుతో కలసి ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ నిర్మిస్తున్న సినిమా "బెజవాడరౌడీలు". ఈ సినిమా పేరు మీద కొందరు అనవసరంగా నానా గొడవ చేస్తున్నారనీ, ఈ విషయంపై కోర్టుకి కూడా వెళ్తున్నారనీ ఇలా రోజుకో న్యుస్ మనం వింటున్నాం.

ఈ విషయంపై రామ్ గోపాల వర్మ స్పందిస్తూ " హైదరాబాద్ కన్నా విజయవాడే నా పుట్టినిల్లు. నేను సినిమా దర్శకత్వం నేర్చుకుంది విజయవాడలోనే. నా మొదటి సినిమా "శివ" నుంచీ ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నింటికీ వచ్చిన పేరేదైనా ఉంటే అది విజయవాడ మూలంగానే నాకు లభించిందని చెప్పాలి. నాకు విజయవాడంటే అంత గౌరవం. అలాంటి విజయవాడ గురించి చెడుగా సినిమా తీస్తానని ఎవరైనా ఎలా అనుకుంటారు. కొన్ని దుష్టశక్తులు ఈ సినిమా పేరు మార్చాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. అందుకని నేను విజయవాడ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమాలో విజయవాడను కించపరిచే సన్నివేశాలేం ఉండవని హామీ ఇస్తున్నాను" అని అన్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.