English | Telugu

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పై రామ్ చరణ్ కన్ను

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పై రామ్ చరణ్ కన్నుపడిందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే రామ్ చరణ్ ఇంతవరకూ పేరున్న బ్యానర్లలోనే హీరోగా నటించాడు. తన తొలి చిత్రం "చిరుత" వైజయంతీ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మించగా, రెండవ చిత్రం "మగధీర" గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించగా, మూడవ చిత్రం "ఆరెంజ్" అంజనీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అతని బాబాయ్ నాగబాబు నిర్మించారు. తన సినిమాల హిట్లు, ఫ్లాపులు పట్టించుకోకుండా, తాను సినిమా చేసే బ్యానర్ కి విలువ ఉందా లేదా అన్నవిషయాన్ని మాత్రం రామ్ చరణ్ చాలా బాగా పట్టించుకుంటున్నాడు.

రామ్ చరణ్ ప్రస్తుతం మెగాసూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లో సంపత్ నంది దర్శకత్వంలో "రచ్చ"అనే సినిమాలో నటించటానికి అంగీకరించాడు. ఈ సినిమా "రచ్చ"లో మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తూంది. అయితే రామ్ చరణ్ చూపు ఇప్పుడు ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పడిందని వినపడుతూంది.ఆర్ ఆర్ మూవీ మేకర్స్ క్వాలిటీ కోసం రాజీపడని వారి నిర్మాణపు విలువలు రామ్ చరణ్ కి బాగా నచ్చాయట. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ వారేమో ప్రస్తుతం రెండేళ్ళ వరకూ వేరే సినిమా గురించి ఆలోచించేంత ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.