English | Telugu

జె.యఫ్.డబ్ల్యూ ఫొటోషూట్ లో సమంత

జె.యఫ్.డబ్ల్యూ. ఫొటోషూట్ లో సమంత పాల్గొంది. వివరాల్లోకి వెళితే జె.యఫ్.డబ్ల్యూ అంటే జస్ట్ ఫర్ వుమెన్ అని అర్థం. ఈ పత్రిక ముఖ చిత్రంగా ప్రముఖ హీరోయిన్ "ఏ మాయ చేశావే" ఫేం సమంత ముఖాన్ని వేయటం కోసం ఆ పత్రిక వారు సమంతతో ఒక ఫొటో షూట్ ను ఏర్పాటుచేయగా సమంత ఆ ఫొటో షూట్‍ లో పాల్గోంది. ఈ జస్ట్ ఫర్ వుమెన్ అనే పత్రిక ముఖ చిత్రంగా వేసేందుకు గతంలో జరిపిన ఫొటో షూట్ లో ప్రముఖ హీరోయిన్ మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా, ఆమెకన్నా ముందు శ్రియ శరణ్ కూడా పాల్గొన్నారు.ఆ ఫొటో షూట్ లో పాల్గొన్న సమంత ఫొటోలు కొన్ని మా తేలుగు వన్ ప్రేక్షకుల కోసం అందిస్తున్నామ. చూసి ఆనందించండి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.