English | Telugu

మంచి పని కోసం బాలీవుడ్ తారల ర్యాంప్ వాక్

మంచి పని కోసం బాలీవుడ్ తారల ర్యాంప్ వాక్ చేయటం ప్రేక్షకులకు కన్నుల విందు చేసింది. వివరాల్లోకి వెళితే మామూలుగా ర్యాంప్ వాక్ చేసేది ఎవరయ్యా అంటే ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్ తను తయారుచేసిన దుస్తులకు పబ్లిసిటీ చేసుకునేందుకు టాప్ మోడల్స్ తో ర్యాంప్ వాక్ చేయించటం ఎక్కడైనా సహజంగా జరిగేదే. కానీ బాలీవుడ్ నటీనటులు ఒక సత్కార్యం కోసం ర్యాంప్ వాక్ చేశారు. పిడిలైట్ సి.పి.ఎ.ఎ. ఛారిటీ ఫ్యాషన్ షోలో కాజోల్, వివేక్ ఒబెరాయ్, మధు దత్తా వంటి బాలీవుడ్ తారలు ర్యాంప్ వాక్ చేశారు. ఈ ర్యాంప్ వాక్ షో ఫొటోలను తెలుగువన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చూసి ఆంనందించండి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.