English | Telugu

టాలీవుడ్‌ ప్రముఖులు ఓటు వేయనున్న పోలింగ్‌ బూత్‌లివే...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాలవారు సైతం ఈ ఎన్నికల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రెండు దఫాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్‌.. మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్‌ కొట్టాలన్న పట్టుదలతో ఉంటే.. ఎలాగైనా కేసీఆర్‌ బృందాన్ని ఓడిరచి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్‌, బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రజలు, ప్రముఖులు ఉత్సాహం చూపిస్తున్నారు. నవంబర్‌ 30న జరగనున్న ఎన్నికల్లో సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వివిధ పోలింగ్‌ బూత్‌లకు రాబోతున్నారు. మరి టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు ఏయే బూత్‌లలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారో చూద్దాం..

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165) :
మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్‌
ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164) :
విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌, రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌
పోలింగ్‌ బూత్‌ 160: విశ్వక్‌సేన్‌
పోలింగ్‌ బూత్‌ 166 : దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు,
జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149) : చిరంజీవి, సురేఖ, రాంచరణ్‌, ఉపాసన, నితిన్‌
ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌ 157) : రవితేజ
ఓబుల్‌రెడ్డి స్కూల్‌(పోలింగ్‌ బూత్‌ 150) : జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి
బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153) : అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి, అల్లు అరవింద్‌, అల్లు శిరీష్‌
వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌(పోలింగ్‌ బూత్‌ 151) : అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌
మణికొండ : హైస్కూల్‌ ప్రభాస్‌, అనుష్క, వెంకటేశ్‌, బ్రహ్మానందం
షేక్‌ పేట్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ : రాజమౌళి, రమా రాజమౌళి
రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ ఆర్థిక సహకార సంస్థ : అల్లరి నరేశ్‌
యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల : తనికెళ్ల భరణి

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.