English | Telugu

వర్మ ‘ఐస్‌క్రీమ్‌’ కోసం నగ్నావతారం!

‘దర్శకసంచలనం’ రాంగోపాల్‌వర్మ తాజాగా రూపొందిస్తున్న ‘ఐస్‌క్రీమ్‌’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతున్న వర్ధమాన యువ కథానాయకి తేజస్వి ఇప్పటికే అందరి దృష్టినీ అమితంగా ఆకర్షిస్తోంది. అంతే కాకుండా ‘ఐస్‌క్రీమ్‌’ చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం తేజస్వి పూర్తి నగ్నంగా నటించింది. ఈ విషయాన్ని ఆ చిత్ర యూనిట్‌ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. మరి ఆ సన్నివేశాన్ని ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాలో సెన్సార్‌ కత్తెరకు దొరకకుండా రాంగోపాల్‌వర్మ ఎలా ప్రజెంట్‌ చేసి ఉంటాడనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్‌. ఈ చిత్రాన్ని ‘భీమవరం టాకీస్‌’ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు!!