English | Telugu

జూలై 4న వరల్డ్‌వైడ్‌గా వెంకటేష్‌ ‘దృశ్యం’

మలయాళంలో సూపర్‌ డూపర్‌హిట్‌ అయిన ‘దృశ్యం’ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్‌, మీనా జంటగా మూవీ మొఘల్‌ డా॥ డి.రామానాయుడు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌, రాజ్‌కుమార్‌ థియేటర్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై సీనియర్‌ హీరోయిన్‌ శ్రీప్రియ దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, రాజ్‌కుమార్‌ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. వెంకటేష్‌, మీనా జంటగా గతంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. కొంత గ్యాప్‌ తర్వాత వీరిద్దరూ కలిసి ఈ చిత్రంలో నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 4న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతోంది. విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో ఇది మరో మంచి చిత్రం అవుతుంది. ఈ చిత్రంలో రాంబాబు అనే సింపుల్‌ రోల్‌ చేశాను. ప్రతి కుటుంబంలోనూ మంచి, చెడు సంగతులు జరుగుతుంటాయి. నచ్చని విషయాలతో ఓ సాధారణ వ్యక్తి ఎలా పోరాడాడు అనేది చిత్ర కథ. శ్రీప్రియగారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.