English | Telugu

పవన్ కళ్యాణ్ "తీన్ మార్"ఐదున్నర కోట్లకు హక్కులు

"తీన్ మార్" అనే తెలుగు సినిమా శాటిలైట్ హక్కులను జెమినీ టెలివిజన్ సంస్థ అయిదున్నర కోట్ల ఫ్యాన్సీ మొత్తానికి సొంతం చేసుకుందట.పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న చిత్రం"తీన్ మార్".ఇది బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన "లవ్ ఆజ్ కల్" చిత్రానికి రీమేక్ అన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిన సంగతే.ఈ చిత్రం తెలుగు రీమేక్ లో త్రిష తో పాటు కృతి కర్బందా కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడూ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు వ్రాయటం విశేషం.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.