English | Telugu

యన్ టి ఆర్ "శక్తి" ఆడియో రిలీజ్ ఎప్పుడు...?

వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా,ఇలియానా హీరోయిన్ గా, "కంత్రీ, బిల్లా" చిత్రాల దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీదత్ నిర్మిస్తున్న భారీ చిత్రం "శక్తి".ఈ చిత్రం మొదలు పెట్టి ఇప్పటికి సరిగ్గా సంవత్సరం అయ్యింది. ఈ చిత్రాన్ని మార్చి నెలాఖరుకు విడుదల చేస్తామని ముందే చెప్పారు.

అయితే ఈ చిత్రం ఆడియో మాత్రం ఫిబ్రవరి 27 వ తేదీన కానీ లేదా మార్చి 2 వ తేదీన కానీ విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం.అది గాక ఈ చిత్రం ఆడియోని హైదరాబాద్ లోనే విడుదల చేస్తారా...? లేక గుంటూరులో విడుదల చేస్తారా అన్న విషయం ఇంకా నిర్థారణ కాలేదు.ఈ చిత్రంలో ఇంకా పూజా బేడీ,జాకీ ష్రాఫ్ తదితర బాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు.


రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.