English | Telugu
పవన్ తీన్ మార్ వెయ్యి థియేటర్లలో 4 వేల షోస్
Updated : Apr 12, 2011
ఈ పవన్ "తీన్ మార్" చిత్రం ఆడియోకి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తూంది. హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని "తీన్ మార్" చిత్రంగా రీమేక్ చేస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ గత చిత్రం"కొమరంపులి" ఫ్లాపవటంతో ఈ చిత్రం మీద పవర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడి పనిచేసినట్లు సమాచారం. ఈ పవన్ "తీన్ మార్" చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేశారు.