English | Telugu

‘తర్లా’ మూవీ రివ్యూ

మూవీ : తర్లా
నటీనటులు: హుమ ఖురేషి, షరీబ్ హష్మీ, భారతీ అచ్రేకర్, పుర్ణేందు భట్టాచార్య, గరిమ అగర్వాల్, రాఘవ్ బినాని, రాకేష్ దూబే
రచన : గౌతమ్ వేద్, పియూష్ గుప్త
సినిమాటోగ్రఫీ: షాలు కే థామస్
మ్యూజిక్: సుహిత్ అభ్యంకర్
ఎడిటింగ్: గౌరవ్ అగర్వాల్
నిర్మాతలు: అశ్విని అయ్యర్‌ తివారి, నితీష్ తివారి
దర్శకత్వం: పియూష్ గుప్త

1960 & 70 లలో తన రెసిపీ బుక్స్ తో పెళ్ళైన తర్వాత కూడా కష్టపడి ఫేమాస్ అయి, 2007 లో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ వచ్చిన ఇండియన్ ఫుడ్ రైటర్ తర్లా దలాల్ గారి రియల్ స్టోరీ ఇది. జీ5 లో తెలుగు వర్షన్ అందుబాటులో ఉన్న ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం.

కథ:

తర్లా దలాల్( హుమ ఖురేషీ) ఒక ఇండిపెండెంట్ గా ఆలోచించే అమ్మాయి. తనేదో ఒకటి సాధించాలని కలలు కంటుంది. అయితే వాళ్ళ అమ్మ నువ్వేం చేయాలనుకున్నా పెళ్ళి తర్వాత చేసుకోమని ఒక పెళ్ళికొడుకుని తీసుకొచ్చి పెళ్ళికి ఒప్పిస్తుంది. దాంతో తర్లా( హుమ ఖురేషీ), పూనే లోని ఒక ఫ్యాక్టరీలో క్వాలిటీ సూపర్ వైజర్ గా చేస్తున్న నలిన్ కుమార్(షరీబ్ హష్మీ) ని పెళ్ళి చేసుకుంటుంది. అయితే భర్త నలిన్ కుమార్ ఎప్పుడు తనని ఎంకరేజ్ చేస్తూ తనకు అండగా నిలిచేవాడు. అయితే ఒకరోజు నలిన్ కుమార్ చేస్తున్న ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసేస్తారు. దాంతో నలిన్ మరొక జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే టైమ్ లో .. తర్లాకి తను చేస్తున్న వంటలన్నీ ఎక్కువ మందికి చేరాలని భావిస్తుంది. దాంతో తన వంటలన్నీ కలిపి ఒక బుక్స్ పబ్లిషింగ్ చేపించాలని అనుకుంటుంది. మరి తను బుక్స్ ని పబ్లిష్ చేసిందా? తర్లా భర్త నలిన్ కుమార్ ఏం చేశాడు? తర్లా జీవితంలో నలిన్ పాత్రేంటనేది మిగతా కథ.

విశ్లేషణ:

ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే, ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఉంటాడంటూ తెలియజేసే ఈ " తర్లా " ఆకట్టుకుంది. తర్లా లైఫ్ లో ఒక్కో స్టేజ్ లో తనకి ఎదురైన సమాస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఫ్యామిలీ నుండి ప్రెషర్ లాంటి వాటిని దాటి తను సక్సెస్ అయిందా, లేదా అని తెలియజేస్తూ తీసిన ఈ కథ ప్రేక్షకులకు నచ్చేస్తుంది. అయితే ఎక్కువ ట్విస్ట్ లు, సస్పెన్స్ , థ్రిల్ లాంటివి లేకుండా సింపుల్ పాయింట్ అంతే సింపుల్ గా ముగించారు మేకర్స్.

ఇది బయోపిక్ కావడం వల్ల ప్రతీ ఒక్కటి వివరంగా చూపించారు. దాంతో ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యేవరకు తర్లా పెళ్ళి జరిగాక, పిల్లల భాద్యతలు తీసుకున్నప్పుడు ప్రతీ ఇంట్లో జరిగేదే కదా అన్న భావన కలుగుతుంది. అయితే ఎప్పుడు అయితే తను ఒకరికి వంట నేర్పితే పెళ్ళి జరుగుతుందో.. అప్పుడు తన మీద‌ తనకి ఒక నమ్మకం వస్తుంది. అదే సమయంలో తర్లా భర్త నలిన్ కుమార్ తన కళకి గౌరవమిచ్చి తనకి ప్రోత్సాహం ఇవ్వడమనేది ఆకట్టుకుంది. ప్రతీ పరిస్థితులలో తన భర్త అండగా ఉండటం, భార్య అంటే వంటింటికే పరిమితం కాదని చెప్తూ తన కళలకి స్వేచ్ఛనిచ్చే విధంగా నలిన్ కుమార్ ని చూపించే ప్రయత్నం బాగుంది.

తర్లా పెళ్ళి తర్వాత లైఫ్ ని ఎలా స్టార్ట్ చేసింది మొదలుకొని తన సక్సెస్ అయ్యేవరకు ఎలా జరిగిందో తీసిన ఈ కథలో కుటుంఒ జరిగే ఎమోషనల్ సీన్స్, పెళ్ళి తర్వాత ఎలాంటి విషయాలు ప్రభావితం చూపుతాయో చక్కగా చూపించాడు. అయితే ఫస్టాఫ్ అంతా స్లోగా సాగుతుంది. ఎప్పుడైతే తర్లా తనలోని కళ తెలుసుకుంటుందో.. ఆ కళకి ఒక రూపమివ్వాలని భావించిన నుండి కథలో వేగం పెరుగుతుంది. అదంతా కామన్ ఆడియన్స్ ఈజీగా ఊహించొచ్చు. అయితే తర్లాకి పేరు ప్రఖ్యాతలు తొందరగా వస్తాయి. దానిని అలానే చూపించడంతో పెద్దగా ఆసక్తికరంగా ఉండదు. బోల్డ్ సీన్స్ ఏమీ లేవు. నిడివి ఎక్కువగా లేకపోవడ‌ం కూడా మంచిదే అయింది. ఏ అంచనాలు లేకుండా సినిమాని చూస్తే మాత్రం నచ్చుతుంది. నచ్చకపోవడానికి పెద్దగా కారణాలు ఉండవు. కానీ ఈ మూవీ నిడివి కాస్త ఎక్కువ ఉంది. అది తగ్గిస్తే బాగుండేది. చివరివరకు ఏం జరుగుతుందో మనం ముందుగానే చెప్పేయోచ్చు. అయితే ఆడదానికి సపోర్ట్ గా మగాడు ఉంటే ఎలా ఉంటుందో చాలా చక్కగా చూపించాడు.

గౌరవ్ అగర్వాల్ ఎడిటింగ్ బాగుంది. ఫస్టాఫ్ లో కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. సుహిత్ అభ్యంకర్ మ్యూజిక్ పర్వాలేదు. షాలు కే థామస్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

నలిన్ కుమార్ గా షరీబ్ హష్మీ ఒదిగిపోయాడు. తర్లాకి సపోర్ట్ చేసే పాత్రలో మెప్పించాడు. తర్లా పాత్రలో హుమ ఖురేషీ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది‌. కథని ఏ మాత్రం డైవర్ట్ కానీయకుండా అలా తీసుకెళ్ళిపోయింది. పక్కింటి ఆంటీగా భారతి అచ్రేకర్ మంచి సపోర్ట్ ఇచ్చింది. కంపెనీ సీఈఓగా పూర్ణేందు భట్టాచార్య ఆకట్టుకున్నాడు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

ఫ్యామిలీతో కలిసి ఒకసారి చూడొచ్చు. ముఖ్యంగా ఇంట్లోని ఆడవాళ్ళకి ఈ సినిమా ఆదర్శంగా నిలుస్తుంది.

రేటింగ్: 2.5 / 5

✍🏻. దాసరి మల్లేశ్

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.