English | Telugu
తారక్ కోసం హృతిక్ త్యాగం!
Updated : Apr 15, 2023
హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించనున్న సినిమా వార్2. ఇటీవల బ్రహ్మాస్త్రతో మెప్పించిన డైరక్టర్ అయాన్ ముఖర్జీ డైరక్ట్ చేయనున్నారు. ట్రిపుల్ ఆర్‌తో ప్రపంచస్థాయిలో సత్తా చాటారు తారక్. అటు వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని మెప్పిస్తున్నారు హృతిక్. ఇప్పుడు ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఇమీడియేట్‌గా వార్2 సెట్స్ మీదకు వస్తారు. అందుకే ఆయనకు మరే సినిమాకూ టైమ్ లేదు. ఈ విషయాన్నే హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ప్రస్తావించారు. క్రిష్ 4 సినిమా వచ్చే ఏడాదిలోపు మొదలు కాబోదనే స్పష్టత నిచ్చారు.రాకేష్ మాట్లాడుతూ ``క్రిష్ ఫ్రాంఛైజీ లవర్స్ కి ఈ వార్త చేదుగా ఉంటుందనే నిజం నాకు తెలుసు. కానీ, అదే నిజం. క్రిష్ అన్ని వయసుల వాళ్లనీ మెప్పించిన సినిమా. పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా ఆ కాన్సెప్ట్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడెప్పుడా అని చాలా సార్లు అడుగుతున్నారు. అలాంటివారందరికీ నేను చెప్పేది ఒక్కటే. క్రిష్ 4ని వచ్చే ఏడాది ఎండింగ్‌లోపు మేం మొదలుపెట్టలేం.
హృతిక్ మిగిలిన సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అన్నీ లార్జర్ దేన్ లైఫ్ మూవీసే. ఇప్పుడు వాటి మధ్య క్రిష్4ని మొదలుపెడితే ఇబ్బంది అవుతుంది. సెట్స్ మీద చాన్నాళ్లు ఉన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. అలా మెస్ కావడం మాకు ఇష్టం లేదు. అందుకే స్క్రిప్ట్ మీద డీప్‌గా పనిచేస్తున్నాం. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పకడ్బంధీగా చేసుకుంటున్నాం. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ వేదిక మీద కూడా ఇలాంటి కాన్సెప్టులను టచ్ చేసేవారు అరుదు. అందుకే ఎప్పటికైనా మా కాన్సెప్ట్ ఫ్రెష్‌నెస్ అలాగే ఉంటుంది. తండ్రీ, కొడుకుల మధ్య అద్భుతమైన ఎమోషనల్ ట్రాక్ కుదిరింది. స్క్రీన్ మీద పండగలా ఉంటుంది`` అని చెప్పారు. దీన్నిబట్టి తారక్ తో వార్ 2 సినిమాను ముందుకు జరిపి తన క్రిష్4 విషయంలో త్యాగం చేశారన్నమాట హృతిక్.