English | Telugu

The Raja Saab: ది రాజాసాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే! ఫ్యాన్స్  రియాక్షన్ ఏంటి 

-నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్న తగ్గని జోరు
-వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత
=ఫ్యాన్స్ ఏమంటున్నారు

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)ప్రస్తుతం 'ది రాజాసాబ్'(The Raja Saab)తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత వింటేజ్ లుక్ తో ప్రభాస్ చేసిన లోకల్ సబ్జెట్ తో పాటు హర్రర్ థ్రిల్లర్ కూడా కావడంతో అమెరికా నుంచి అనకాపల్లి దాకా అభిమానులు, మూవీ లవర్స్ , ప్రేక్షకులతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిచ్చాయి. మరి ఈ నేపథ్యంలో ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.


సినీ ట్రేడ్ వర్గాల ప్రకారం రాజా సాబ్ ఇండియాలో ఫస్ట్ డే 54 .15 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ నిరాబట్టినట్టుగా తెలుస్తుంది. సదరు కలెక్షన్స్ ని లాంగ్వేజ్ వారీగా చూసుకుంటే తెలుగులో 47 .4 కోట్లు, హిందీ 6 .15 కోట్లు, తమిళం 0.4; కన్నడ: 0.1 ,మలయాళం 0.1 చొప్పున మొత్తం 54 .15 కోట్ల రూపాయలు. అలాగే ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా 9 .15 కోట్లు రాబట్టింది. దీంతో తొలి రోజు ఇండియాలో 63 .30 కోట్లు రాబట్టినట్లయింది. ఇక ఓవర్ సీస్ లో తొలి రోజు 29కోట్లు సాధించినట్టుగా టాక్ .ఇలా టోటల్ గా వరల్డ్ వైడ్ గా 92.30 కోట్లు నెట్ ని రాబట్టినట్లయింది. అంటే గ్రాస్ పరంగా చూసుకుంటే 112 కోట్లు. మేకర్స్ కూడా 112 కోట్ల రూపాయిల గ్రాస్ అని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు

Also read: రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా

ఇక సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అయితే కొద్దిగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఈ మేరకు రాజా సాబ్ గురించి వాళ్ళు చెప్తున్న మాటలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రివ్యూస్ కూడా నెగిటివ్ గానే వస్తున్నాయి. ప్రభాస్ తో పాటు నిది అగర్వాల్(Nidhhi Agerwal),మాళవిక మోహనన్(Malavika Mohanan),రిద్ది కుమార్(Riddi KUmar),సంజయ్ దత్, జరీనా వహబ్ పెర్ ఫార్మెన్స్ కి మాత్రం మంచి పేరు వస్తుంది. దర్శకుడు మారుతీ(Maruthi)అందించిన కథ, కథనాలు ప్రధాన మైనస్ గా నిలిచినట్టుగా టాక్. పీపుల్ మీడియా నిర్మాణ విలువలుకి మాత్రం మంచి పేరు వస్తుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.