English | Telugu
రోడ్డు ప్రమాదంలో డైరెక్టర్ మృతి!
Updated : Nov 8, 2023
ఈమధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వరుస విషాద వార్తలు వింటున్నాము. దక్షిణాది సినీ పరిశ్రమలోనే ఈ విషాద వార్తలు చోటు చేసుకోవడం గమనార్హం. మలయాళ ఇండస్ట్రీలోనే ఈమధ్య ఎక్కువ మరణాలు సంభవించాయి. టీవీ ఆర్టిస్టులు రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకోగా, డా.ప్రియ గుండెపోటుతో మరణించారు. ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కజిన్ తీవ్రమైన జ్వరంతో మృతి చెందారు. ఇక యాంక్ రaాన్సీ పర్సనల్ సెక్రటరీ శ్రీను గుండెపోటుతో చిన్నవయసులో కన్ను మూశారు. ఇవన్నీ మరచిపోక ముందే మరో విషాద వార్త వినాల్సి వస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన డైరెక్టర్ అర్పుదాన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను చెన్నయ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రూప్ డాన్సర్లలో ఒకరిగా తన కెరీర్‌ని స్టార్ట్ చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రాఘవ లారెన్స్‌కు లైఫ్ ఇచ్చారు దర్శకుడు అర్పుదాన్. 2002లో వచ్చిన ‘అర్పుతం’ అనే సినిమాతో లారెన్స్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అర్పుదాన్ దర్శకత్వంలో సూపర్‌గుడ్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మించింది. తమిళ్‌లో ఈ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. లారెన్స్ హీరో కెరీర్‌కి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడిరది. మనతోడు, మజైకాలం అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు అర్పుదాన్. తెలుగులో ఉదయ్ కిరణ్‌తో లవ్ టుడే చిత్రాన్ని తెరకెక్కించారు.