English | Telugu

మిల్కీ బ్యూటీ మారిపోయింది

మిల్కీ బ్యూటీ తమన్నా తమిళ్ లో తన హవా చూపేందుకు రెడీ అయ్యింది. తమిళ మార్కెట్ పై కన్నేసిన ఈ భామ వరుసగా తమిళ సినిమాలు చేసే ఆలోచనలో ఉంది. అందుకే నాజూగ్గా కనిపించే తమన్నా ఇప్పుడు కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపిస్తుంది. ఏదన్నా సినిమా కోసం కాస్త లావయ్యిందా? అని ఆరా తీస్తే..తమిళ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవటం కోసం బొద్దుగా తయారైందట. సన్నగా ఉంటే తమిళ ప్రేక్షకులకు నచ్చదని, కాస్త లావెక్కిందట. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని పట్టుకోవలని తెగ ట్రై చేస్తున్నది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.